సమంత రుతుప్రభ.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే తన నటనతో, అమాయకత్వంతో, చిలిపిచేస్టలతో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సమంత ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అక్కినేని వారి అబ్బాయి నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత అక్కినేని కోడలుగా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది సమంత. కానీ నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత గొడవలు పడి విడాకులు తీసుకున్న వీరు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా సమంత వల్ల ఒక హీరోయిన్ ఎదగలేక పోయింది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.