ఈ మధ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా..? బ్లాక్‌ కాఫీ, అల్లం టీ ట్రై చేయండి.!

-

కొవిడ్‌ వచ్చినప్పటి నుంచి.. చాలమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఊపిరి స‌రిగ్గా ఆడ‌దు. దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యం క‌లుగుతుంది. ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్న‌ప్పుడు, చ‌లి వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు, అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు, అధిక బ‌రువు ఉన్న‌వారికి ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే కొందరికి ఈ సమస్య తాత్కాలికంగా ఉంటుంది.. కొందరికి మాత్రం రెగ్యులర్‌గా ఉంటుంది. కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అల్లంతో త‌యారు చేసిన టీ తాగ‌డం వ‌ల్ల శ్వాస స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌లో ఉండే ఇన్‌ఫెక్ష‌న్ త‌గ్గుముఖం ప‌డుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు త‌గ్గుతాయి. అల్లం ముక్క‌లు నీటిలో వేసి దాంతో డికాష‌న్ త‌యారు చేసి తాగితే మంచిది. లేదా నేరుగా అల్లం ర‌సాన్ని కూడా తాగ‌వ‌చ్చు.
బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల నాసికా రంధ్రాల్లో ఏర్ప‌డే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు కూడా క్లియ‌ర్ అవుతాయి. ఆస్త‌మా ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది. శ్వాస తీసుకోవ‌డంలో ఉన్న ఇబ్బందులు తొల‌గిపోతాయి.

ఈ ఆసనాల ద్వారా కూడా మంచి ఫలితం..

ఒక గోడ‌కు శ‌రీరాన్ని ఆనించి నిల‌బ‌డాలి. చేతుల‌ను తొడ‌ల‌పై ఉంచాలి. భుజాల‌ను వెన‌క్కి ఆనించి రిలాక్స్ అవ్వాలి. ఈ భంగిమ‌లో కొంత సేపు ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా చేయ‌డం వ‌ల్ల శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.
నేల‌పై ప‌ద్మాస‌నంలో కూర్చోవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచాలి. నోటితో గాలిని పీల్చాలి. 4-5 సెక‌న్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచాలి. పెదాల‌ను మూసి ముక్కుతో 4 సెక‌న్ల పాటు శ్వాస‌ను బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 10-15 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.
కొవిడ్‌ వచ్చిన వారికి, టీకా వేసుకున్న వాళ్లకు శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటుంది. గ్యాస్‌ ఉన్న వారికి కూడా ఊపిరి సరిగ్గా అందదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version