చేపల పులుసుతో ఆర్పీ అన్ని లక్షలు సంపాదిస్తున్నారా..?

-

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు హీరోయిన్లే కాదు బుల్లితెర పైన పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్స్ కూడా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తూ వ్యాపారంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, అదిరింది వంటి షోల ద్వారా బాగా పాపులర్ అయిన కిరాక్ ఆర్పి గత కొన్ని నెలల క్రితం జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ పై పలు రకాల విమర్శలు కూడా గుప్పించారు ఆర్పీ.. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లలో చాలామంది ఆర్పీ మాటలను కూడా తప్పుపడ్డారు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టలేదు ఆర్పి.

కానీ ఆ తర్వాత ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈయన తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక రెస్టారెంట్ మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. ఆర్ పీ రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం ఏంటి అని కొంతమంది నెగటివ్ గా కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు 15 బ్రాంచ్ లు హైదరాబాదులో ఏర్పాటు కానున్నాయని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. తను సంపాదించిన డబ్బును ఆర్ పీ ఈ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడట. అంతేకాదు రోజుకు రూ.2లక్షల రూపాయల బిజినెస్ కూడా జరుగుతుందని సమాచారం . రెస్టారెంట్ మొదలుపెట్టి ఇంకా నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే రోజుకు రూ.2 లక్షల ఆదాయం అంటే ఆయన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చినట్లే కదా..

దీన్ని బట్టి చూస్తే నెలకు 60 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుండగా ఆర్పీ కి 20 లక్షల రూపాయలు స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. ముఖ్యంగా ఇతర రెస్టారెంట్లకు భిన్నంగా కట్టెల పొయ్యిపై చేపల పులుసును వండుతుండడంతో ఈ రెస్టారెంట్ కు ప్రజల నుంచి ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. కిరాక్ పార్టీ బిజినెస్ లో సక్సెస్ కావడంతో ఇతర జబర్దస్త్ కమెడియన్లు కూడా సంతోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version