‘కారు’లో తొలిసారి సండ్ర-మెచ్చా పోటీ..గట్టెక్కేనా?

-

ఇంతకాలం టీడీపీలో పోటీ చేసి వచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , మెచ్చా నాగేశ్వరరావు తొలిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. తొలిసారి గులాబీ పార్టీలో పోటీ చేస్తున్న ఈ ఇద్దరు మాజీ తమ్ముళ్ళకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..ఈ సారి గెలిచి గట్టెక్కగలరా? అనే అంశాలని చూస్తే..సత్తుపల్లి నుంచి గత మూడు పర్యాయాల నుంచి సండ్ర వీరయ్య గెలుస్తూ వస్తున్న విషయం తెలిసింది.

అది కూడా ఆయన టీడీపీ నుంచి గెలుస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉండటంతో ఆయన బీఆర్ఎస్‌ లోకి జంప్ కొట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు సైకిల్ సింబల్ పై పోటీ చేసిన వీరయ్య కారు గుర్తుపై పోటీ చేయనున్నారు. అయితే ఈ సారి సత్తుపల్లిలో అనుకున్నంత ఈజీగా వీరయ్య గెలవడం సాధ్యం కాదని తెలుస్తోంది.

 

ఎందుకంటే అక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. పిడమర్తి రవి సత్తుపల్లి సీటు కోసం ట్రై చేస్తున్నారు. సీటు దక్కకపోతే సండ్రకు  సహకరిస్తారా? లేదా? అనేది డౌట్. అదే స్థానంలో మట్టా దయానంద్ ఉన్నారు..ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఆయన ఎటు వెళితే అటు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ టి‌డి‌పి క్యాడర్ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి క్యాడర్ వీరయ్యకు సహకరించడం డౌటే. ఈ పరిస్తితుల్లో వీరయ్య సత్తుపల్లిలో ఎంతవరకు నెగ్గుకోస్తారనేది చూడాలి.

అటు అశ్వరావుపేట ఎమ్మెల్యేగా 2018లో మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. టి‌డి‌పి నుంచి గెలిచిన ఈయన చాలా రోజుల తర్వాత తప్పక బీఆర్ఎస్ లో చేరారు. ఈయన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. అక్కడ కూడా గ్రూపు తగాదాలు ఉన్నాయి. అలాగే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ పరిస్తితుల్లో మెచ్చా గెలిచి గట్టెక్కగలరో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version