బాబు సొంత గడ్డపై టీడీపీ అభ్యర్ధి ఫిక్స్..ఈ సారి కష్టమే!

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత గడ్డ నారావారిపల్లె అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామం..చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక చంద్రబాబు గెలుపు మొదలైంది కూడా చంద్రగిరి నుంచే..1978లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బాబు గెలిచారు..ఇక 1983లో ఊహించని విధంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి..టి‌డి‌పి చేతిలో బాబు ఓటమి పాలయ్యారు.. ఆ తర్వాత ఆయన టి‌డి‌పిలోకి వెళ్ళడం..వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తూ గెలుస్తున్న విషయం తెలిసిందే. అయితే బాబు చంద్రగిరి వదిలి కుప్పం వచ్చాక..చంద్రగిరిలో టి‌డి‌పి గెలుపుకు దూరమైంది. 1999 ఎన్నికల నుంచి 2019 వరకు చంద్రగిరిలో టి‌డి‌పి గెలవలేదు. 1999, 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరుపున గల్లా అరుణ కుమారి గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. ఇక మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చెవిరెడ్డి చూస్తున్నారు.

అయితే చంద్రగిరిపై ఈ సారి టి‌డి‌పి గట్టిగానే ఫోకస్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర చంద్రగిరిలో కొనసాగింది. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది..అలాగే వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారని..ఈ సారి నానిని గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు.

కానీ చంద్రగిరిలో చెవిరెడ్డిని ఓడించడం చాలా కష్టమైన పని..ఆయనకు పార్టీతో పాటు సొంత బలం కూడా ఉంది. అక్కడి ప్రజలు చెవిరెడ్డిపై అభిమానంతో ఉంటారు. అవసరమైతే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉంటారు. కాకపోతే ఇటీవల ఆయనపై అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బలపడాలని టి‌డి‌పి చూస్తుంది. మరి చూడాలి ఈ సారైనా చంద్రగిరిలో టి‌డి‌పి గెలుస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version