మీరు వాడే స‌బ్బు నాణ్య‌మైందేనా..? తెలుసుకోండి ఇలా..!

-

మ‌న‌లో అధిక శాతం మంది నిత్యం స‌బ్బుతోనే స్నానం చేస్తారు. కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే సంప్ర‌దాయ విధానాల‌ను అవ‌లంబిస్తారు. ఇక కొంద‌రు బాడీ వాష్‌తో స్నానం చేస్తారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది స‌బ్బుతో స్నానం చేసేవారికి ప‌నికొచ్చేది. అదేమిటంటే.. స‌బ్బుల‌పై మీరెప్పుడైనా టీఎఫ్ఎం (TFM) అని రాసి దాన్ని ప‌క్క‌న కొంత ప‌ర్సంటేజ్ క‌లిగిన సంఖ్య‌ను చూశారా..? అవును చాలా మంది చూసే ఉంటారు. కానీ దాని గురించి చాలా మందికి తెలియ‌దు. అదేమిటంటే…

మ‌న వాడే స‌బ్బు నాణ్య‌త‌ను తెలియ‌జేసేదే టీఎఫ్ఎం (TFM). దీన్నే Total Fatty Matter అని కూడా అంటారు. ఇది 60 శాతంతో మొద‌లై 80 శాతం వ‌ర‌కు స‌బ్బుల్లో ఉంటుంది. అంటే TFM ఎంత ఎక్కువ ఉంటే స‌బ్బు అంత ఎక్కువ నాణ్యంగా ఉంటుంద‌ని అర్థం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో ల‌భించే ప‌లు ర‌కాల స‌బ్బులు 60 శాతం TFMను క‌లిగి ఉంటే, కొన్ని 72 శాతం, మ‌రికొన్ని 80 శాతం వ‌ర‌కు TFMను క‌లిగి ఉంటున్నాయి. క‌నుక మీరు ఇక‌పై TFM అధికంగా ఉన్న స‌బ్బును కొనుగోలు చేసి వాడండి. ఎందుకంటే.. ఆ స‌బ్బుల్లోనే నాణ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక TFM అస‌లు లేదంటే.. ఆ స‌బ్బు స్నానానికి ప‌నికిరాద‌ని తెలుసుకోండి. అలాంటి స‌బ్బుల‌ను వాడ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

Read more RELATED
Recommended to you

Exit mobile version