అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతుందా?. పేర్ని నాని మాటల వెనుక అర్ధమేంటి?. ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏముంది.?. నాని చెప్పిన దాన్ని బట్టి రఘురామకృష్ణంరాజే అందుకు కారణమా.? అనే అనుమానులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇంకో అంశం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇటీవల బీజేపీ అగ్రనేతలు సీరియస్ అయ్యారు. మద్యంపై ఆదాయాన్ని ముందుగా చూపించి జగన్ అప్పులు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. ఈ అప్పుల్లో లొసుగులు ఉన్నాయనే అనుమానం బీజేపీ అగ్రనేతలకు కలిగిందా..? వీటిపై దర్యాప్తు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడే అవకాశం ఉంటుంది.
మరో కీలకమైన విషయం ఏంటంటే వైసీపీకి, బీజేపీకి సబంధాలు పొత్తు రూపంలో లేవు. రాష్ట్ర హక్కుల పరంగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీకి నిధులు ఇస్తున్నాయి. ఈ నిధుల్లో అవకతవకలు ఉంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటిని ఆలోచించి పేర్నినాని వ్యాఖ్యలు చేశారా..?. అనే అంశంపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ యేతర పక్షాలు ఒక్కటవుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని దింపేదుకు యత్నిస్తున్నారు. ఇందుకు ప్రశాంత్ కిషోర్ బీజం వేశారు. దేశంలోని ప్రతిపక్షాలను ఒక్కటిగా చేస్తున్నారు. పీకేతో జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో జగన్ వారితో కలుస్తారనే ఆలోచన ఉందా?. .. ఇందులో భాగంగానే బీజేపీని వైసీపీ టార్గెట్ చేసిందా?. నిజంగా జగన్… పీకేతో కలిస్తే.. బీజేపీ టార్గెట్‌లో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించారా?. ఇందులో భాగంగానే నాని తీవ్ర వ్యాఖ్యాలు చేశారా?. అనే అంశాలపైనా స్పస్టత రావాల్సింది ఉంది. మరి వైసీపీ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటున్న నాని వ్యాఖ్యల వెనుక కారణం ఎంటో తెలియాలటే కొన్ని రోజులు ఆగాల్సిందే.