చిరంజీవి వివాహం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక చిరంజీవి డాన్స్ అంటే ఇష్టపడే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. చిరంజీవి నోట ఎలాంటి డైలాగ్ చెప్పినా అది ఎప్పుడు పాపులర్ గానే అవుతూ ఉంటుంది. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత చిరంజీవి ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఖైదీనెంబర్150 చిత్రంతో రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ప్రేక్షకులను, అభిమానులను సైతం ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక మెగాస్టార్ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య కూతుర్ని సురేఖ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే అప్పట్లో చిరంజీవి తండ్రి ఈ వివాహానికి ఒప్పుకోలేదనే .. విషయాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన ధవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అప్పటికే చిరంజీవి వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని ధవళ సత్యం తెలియజేశారు. ధవళ సత్యం చిరంజీవి కాంబినేషన్లో జాతర అనే సినిమాను చేశారట.

అయితే ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్గా అల్లు అరవింద్ పని చేసినట్లుగా తెలియజేశారు. ఇక ఆ సమయంలోనే అల్లు రామలింగయ్య ధవళ సత్యం తో చిరంజీవి గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారట. తన కూతురు సురేఖను చిరంజీవి కి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు అని అందుకే ఇలా అడిగానని తెలియజేశారు.

అయితే ఈ వివాహానికి చిరంజీవి తండ్రి ఒప్పుకోలేదట కానీ ఆ తర్వాత చిరంజీవి తండ్రి అన్ని విషయాలను చెప్పి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ కలిసి ఒప్పించారట. అలా వారిద్దరి వివాహం జరిగిందని గుర్తు చేసుకున్నారు దవళ సత్యం. దీంతో సినీ ఇండస్ట్రీలో ఇద్దరు దంపతులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటున్నారు అని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version