హీరో రాజా మత ప్రచార కర్తగా మారడం వెనుక ఇంత కథ ఉందా..?

-

ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో రాజా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఆ నలుగురు వంటి సినిమాలలో కూడా సెకండ్ హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి రాజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ క్రిస్టియన్ మత ప్రచారకర్తగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల సినిమాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే సినిమాల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రాజా ఉన్నటువంటి మత ప్రచార కర్తగా మారడం ఏంటి అని ఆయన అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాజా సినిమాల నుండి ఉన్నట్టుండి దూరమయ్యాడు..

నిజానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాజా ఆ తర్వాత వరుస ఫ్లాప్ లను చవిచూశాడు ఇక చేసేదేమీలేక అవకాశాలు కూడా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఈయన మొదటగా మతాన్ని స్వీకరించాడు. నిజానికి రాజా బాల్యంలో తండ్రి కోల్పోవడం, తల్లిని కోల్పోవడం.. అక్క తో జీవితం కొనసాగించేవాడు. ఆ తర్వాత పై చదువుల కోసం కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ఒక స్థానానికి చేరుకుని స్నేహితుల సలహాలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పటి వరకు పూర్తి సంక్షోభంలో మునిగిపోయిన రాజాకు సినిమా అవకాశాలు రావడంతో ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చింది.

మళ్లీ అక్కడ కూడా నిరాశ ఎదురవడంతో ఆ మతం వారు ఆదరించగా ఇక మతాన్ని పూర్తిగా స్వీకరించిన రాజా అక్కడే లీనమైపోయి సంతోషాన్ని అందులోనే వెతుక్కున్నాడు. కష్టాలనుంచి ఒక్కసారిగా సంతోషం దొరకడంతో ఆయన మనసు కూడా మారిపోయి పూర్తిగా దేవుడిపైనే నిమగ్నమయ్యాడు. అలా ప్రచారకర్తగా మారిపోయి ఇటీవల సినిమాలను కూడా దూషించే స్థితికి చేరుకున్నాడు రాజా.. ఇకపోతే రాజా ప్రవర్తన చూసి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా విమర్శించడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version