ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఆర్ధికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా దెబ్బ కొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ పార్టీలో బలమైన నేతలు అందరికి గాలం వేసారు. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు గాలం వేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురుని వైసీపీలోకి ఆహ్వానించారు. వాళ్ళు కండువా కప్పుకోకపోయినా సరే జై జగన్ అనే పరిస్థితికి వచ్చేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం జగన్ కి జై కొట్టారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ నేతల కోసం జగన్ ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకుని మళ్ళీ వచ్చే ఎన్నికలకు అదే నియోజకవర్గం నుంచి సీటు ఇవ్వడానికి రెడీ అయ్యారట.
అలాగే వచ్చే ప్రభుత్వంలో కేబినేట్ లో స్థానం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మద్దాలి గిరికి ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయి వాటికి తాను అండగా నిలుస్తాను అని చెప్పారట జగన్. దీనితో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమై జగన్ కి జై కొట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకో ఆరుగురు ఉన్నారని అంటున్నారు. అగ్ర నేతలు అందరు ఏదోక పార్టీలోకి వెళ్ళిపోయే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే మరికొందరు నేతలు టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలే స్వయంగా అంటున్నారు. అలాగే ఇద్దరు మాజీ మంత్రులు కూడా టీడీపీ నుంచి బయటకు రావడానికి సిద్దమయ్యారు. త్వరలోనే వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి.