వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరిపాలన విషయంలో చాలా అద్భుతమైన రెస్పాన్స్ రాష్ట్ర ప్రజల నుండి అందుకుంటున్నారు. సంక్షేమ మరియు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా మాట రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే విధంగా వాలెంటరీ తీసుకువచ్చి తనకి ప్రజలకు కనెక్షన్ ఉండే విధంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతా బాగానే ఉన్నా గాని ఒక విషయంలో సొంత వాళ్లే వైయస్ జగన్ ని తప్పుదారి పట్టిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే వైయస్ జగన్ తన తండ్రి మాదిరి పరిపాలిస్తున్న గాని ఒక మీడియా విషయంలో తన చుట్టూ ఉన్న మనుషుల మాటలు విని తప్పు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యవహరించే చానల్స్ యొక్క యాజమాన్యాల తోనే విభేదించారే తప్ప, జర్నలిస్టులతో కాదనే విషయాన్ని గుర్తించాలి. కానీ జగన్ మాత్రం యజమానులతోనే కాదు జర్నలిస్టులు కూడా విభేదిస్తూ తన మీడియా సమావేశాలకు రానివ్వకుండా ఉండటం తన సర్కార్ కి అతి పెద్ద మైనస్ అవుతుందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో సొంత వాళ్ళ మాట పక్కన పెట్టి జగన్ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలు అన్ని చానల్స్ కి చెబితే బాగుంటుందని పేర్కొంటున్నారు.