వన్ డే వరల్డ్ కప్ 2023 తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ?

-

మరో పది రోజుల్లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని జట్లు వ్యూహాలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సొంత గడ్డపై ఆడుతుండడంతో ఇండియాకు చాలా అనుకూలంగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాగా తాజాగా సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఎబి డీవిలియర్స్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, వన్ డే వరల్డ్ కప్ 2027 సౌత్ ఆఫ్రికా లో జరగనుండగా విరాట్ కోహ్లీ ఇక్కడ ఆడడానికి చాలా ఇంటరెస్ట్ గా ఉన్నాడని.. కానీ ఇది జరిగేలా కనిపించడం లేదని ఎబిడి అభిప్రాయపడ్డారు. మరో 10 రోజుల్లో స్టార్ట్ కానున్న వరల్డ్ కప్ గెలిస్తే కోహ్లీ వన్ డే లు మరియు టీ 20 లకు గుడ్ బై చెప్పడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని షాక్ ఇచ్చాడు ఎబిడి. ఆ తర్వాత కేవలం ఐపీఎల్ మరియు టెస్ట్ లలో మాత్రమే కొనసాగుతాడని ఎబిడి క్లారిటీ ఇచ్చాడు.

ఎందుకంటే ఇతను ఫామిలీ తో ఎక్కువగా సమయాన్ని ఆస్వాదించడానికి నిర్ణయించుకున్నాడు అంటూ ఎబిడి కోహ్లీ భవిష్యత్తు గురించి చెప్పాడు ఎబిడి. దీనితో అభిమానులు షాక్ కు గురవుతున్నారు, నిజంగానే కోహ్లీ రిటైర్మెంట్ కానున్నాడా అంటూ ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version