మనం ల్యాప్ టాప్ లో సీరియస్ గా పనిచేస్తుంటే..సిస్టమ్ స్లోగా ఉంటే పిచ్చిలేస్తది కదా..అసలు పని చేయాలన్నా మూడ్, ఉత్సాహం అన్నీ పోతాయ్. సిస్టమ్ స్లో అయితే ఆ ఎఫెక్ట్ మన పనిమీద పడుతుంది. అయితే కొన్ని చిన్న టిప్స్ పాటించామంటే మీ పీసీ లేదా, కంప్యూటర్ ను ఫాస్ట్ గా వర్క్ అయ్యేలా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ట్రైన్ కట్టకండి.
ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. ఇది సహజమే. కానీ, ఇలా వీలైనంత ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల ల్యాప్‌టాప్ ర్యామ్ ప్రాసెసర్‌పై భారం పెరిగి పీసీ నెమ్మదిస్తుంది. కాబట్టి ఖాళీగా ఉందని ట్యాబ్‌బార్ మొత్తాన్ని ట్రైన్ లెక్క వరుసగా నింపకండి. వెంటవెంటనే ఉపయోగించని ట్యాబ్‌లను క్లోజ్ చేయండి.
‘బ్యాక్‌గ్రౌండ్’
మనం వాడినా వాడకున్నా చాలా ప్రోగ్రామ్స్ సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ లో నడుస్తూనే.. ఉంటాయి. Ctrl+Shift+Esc క్లిక్ చేయడం వల్ల విండోస్ టాస్క్ మేనేజర్ లో అవెంటో తెలుసుకోవచ్చు. అందులోని ఏ ప్రోగామ్ అయితే మీకు అనవసరం లేదు అనిపిస్తే.. అనిపిస్తుందో దానిపై రైట్ క్లిక్ చేసి ‘ఎండ్ టాస్క్’ చేయండి.
రీఫ్రెష్ మర్చిపోవద్దు
సిస్టమ్ రీస్టాట్ చేయడం ద్వారా తాత్కాలిక క్యాచీ క్లియర్ అయి సిస్టమ్ తాజాగా పనిచేస్తుంది. ఇక ల్యాప్‌టాప్ పనితీరు మందగించడానికి సిస్టమ్ అప్‌డేట్ చేయకపోవడమూ ఒక కారణం అవుతుందని మర్చిపోకండి. కాబట్టి క్రమం తప్పకుండా సిస్టమ్ అప్‌డేట్ చేస్తూ పీసీ పనితనాన్ని పెంచుకోండి.
వాడకపోతే వద్దు
చాలా రోజుల కిందట డౌన్‌లోడ్ చేసిన కొన్ని యాప్‌లు లేదా ప్రోగ్రామ్స్ వాటి పని అయిపోయిన తర్వాత మనం వాటిని మనం అలానే వదిలేస్తాం. వాటిని వాడకపోతే..వాటిని అలాగే వదిలేయకుండా వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ పీసీని పరుగులు పెట్టించడంలో బాగా పనిచేస్తుంది..
వీటితో పాటు క్యాచీ క్లియర్ చేయటం మర్చిపోకండి. ctrl+shift+ dltను ఒకేసారి ప్రస్ చేయడం వల్ల మీ సిస్టమ్ లో క్యాచీ అంతా క్లియర్ అవుతుంది. అప్పుడప్పుడు ఇది కూడా చేయండి. ఇంకా రిసైకిల్ బిన్ ను కూడా క్లియర్ చేస్తూ ఉండాలి. మనం డిలీట్ చేసిన స్క్రాప్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఇది ఎలాగో మనకు అవసరం ఉండదు కాబట్టి వారానికి ఓ సారి ఈ రెండూ చేస్తూ ఉండటం మర్చిపోకండి. ఇలా చేస్తే సిస్టమ్ స్లో అవ్వకుండా వర్క్ అవుతుంది.