భార్యా, భర్త వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతూ వుంటారు. చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులుని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి వైవాహిక జీవితంలో అందరూ ఆనందంగా ఉండలేరు. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలను చూస్తే మనం ఆనందంగా లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే మీ రిలేషన్ షిప్ లో కూడా ఇవి ఉన్నాయా..? కచ్చితంగా మీ పార్ట్నర్ తో మీరు సంతోషంగా లేనట్టే.
శృంగారం కి దూరంగా ఉండడం:
దాంపత్య జీవితంలో మీరు హాయిగా లేరు అంటే శృంగారానికి దూరంగా ఉంటారు. ఆనందంగా లేని వాళ్లకి అసలు శృంగారం లో పాల్గొనాలని అనిపించదు ఇలా కనుక మీకు కూడా అనిపిస్తున్నట్లయితే కచ్చితంగా మీ వైవాహిక జీవితంలో మీరు ఆనందంగా లేనట్టే.
విడిపోవాలని భావన కలగడం:
విడిపోవాలి అని ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే కూడా మీరు దాంపత్య జీవితంలో ఆనందంగా లేనట్లు.
మరొకరితో సంబంధం పెట్టుకోవడం:
మీరు మీ పార్ట్నర్ తో ఆనందంగా లేకపోతే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది లేదంటే మరొకరితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటారు.
మాట్లాడుకోరు:
భార్య భర్తల ఆనందంగా లేరు అంటే పక్కపక్కన వున్నా మాట్లాడుకోరు మీరు మీ భర్త కూడా ఒకే ఇంట్లో వున్నా మాట్లాడుకోవడం లేదంటే కచ్చితంగా మీరు ఆనందంగా లేనట్లే. అయితే దాంపత్య జీవితంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులని వీలైనంత వరకు తగ్గించుకుంటూ ఉండాలే తప్ప పెంచుకుంటూ వెళ్లిపోకూడదు కాబట్టి భార్యాభర్తలు కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకుపోతే మంచిది.