విద్యార్థులకి గుడ్ న్యూస్…ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు…!

-

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో చాలా విషయంలో మార్పు వచ్చింది. అలానే టెక్నాలజీకి అనుగుణంగా కొత్త​ కోర్సులను కూడా తీసుకొస్తున్నారు. తాజాగా ఇండియన్​ స్పేస్​ రిసెర్చ్​ ఆర్గనైజేషన్ ఫ్రీగా రెండు కోర్సులని స్టార్ట్ చేసింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే…

ఇస్రో పరిధిలోని డెహ్రాడూన్​లో ఉన్న ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ రిమోట్​ సెన్సింగ్ రెండు కోర్సులు తీసుకొచ్చింది. రిమోట్ సెన్సింగ్​, జియోగ్రాఫికల్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్ పై ఆన్ లైన్ కోర్సులకి దరఖాస్తు చేసుకోమంది. మొత్తం 12 రోజుల్లో ఇది పూర్తి అవుతుంది. దీనిలో భాగంగా వ్యవసాయం, నేల, అటవీ వంటి అంశాల గురించి నేర్చుకొచ్చు.

దీనికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోచ్చు. అలానే కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే టెక్నికల్ లేదా​ సైంటిఫిక్​ స్టాఫ్​, యూనివర్సిటీల పరిధిలోని పరిశోధకులు కూడా పాల్గొనవచ్చు. నవంబర్​ 8 నుంచి నవంబర్ 26 వరకు ఈ కోర్సు ఉంటుంది.

ఈ కోర్సు లో పాల్గొన్న వారికి ఇస్రో నుండి సర్టిఫికెట్ వస్తుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. లెక్చర్ స్లైడ్‌లు, వీడియో-రికార్డెడ్ లెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లాంటి విధానంలో స్టడీ మెటీరియల్​ను ఆన్​లైన్​లో తీసుకొస్తారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version