సోనూసూద్ ఇంటిపై IT దాడులు !

-

రియల్‌ హీరో సోనూసూద్‌ ఇంటి పై ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. సోనూ సూద్‌ కు చెందిన ఆరు నివాసాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం అందుతోంది. ముంబై లోని ఆయనకు చెందిన ఆఫీసు లో కూడా తనీఖీలు చేసినట్లు సమాచారం. ముంబై లోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటాల్‌ షిప్‌ ప్రోగ్రాం కు ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. సోనూసూద్‌ ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియామకం చేసింది. అంతకు ముందు పంజాబ్‌ ప్రభుత్వం లో కూడా కరోనా వైరస్‌ మీద అవగాహన కార్యక్రమం లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీ పార్టీ కి వ్యతిరేకంగా ఉన్నవి కావడం గమనార్హం. ఇలాంటి నేపథ్యం లో సోనూసూద్‌ కు చెందిన టు వంటి.. ఆరు నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సర్వే చేశారనే సమాచారం.. దేశ వ్యాప్తం గా అలజడి రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version