“యు ట్యూబర్” పై IT దాడులు … రూ. 24 లక్షలు స్వాధీనం !

-

నేడు యువత బాగా చదువుకుని అర్హతకు తగిన ఉద్యోగాలు రాకపోతే, విసుగు చెంది మీడియా రంగాన్ని తమ కెరీర్ గా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యు ట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ డబ్బును సంపాదించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక తాజాగా యు ట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక యూట్యూబర్ తస్లీమ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యూపీలోని బరేలీకి చెందిన తస్లీమా ట్రేడింగ్ హబ్ 3.0 అనే పేరుతో గత కొంతకాలంగా యు ట్యూబ్ ఛానెల్ ను నడుపుతున్నాడు. ఈ యు ట్యూబ్ ఛానెల్ లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు సంబంధించిన వీడియోలను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియోల ద్వారా తస్లీమ్ కు బాగానే ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోల ద్వారా ఇతను రూ. 1.2 కోట్లు అమౌంట్ సంపాదించాడు. పైగా సంపాదించిన అమౌంట్ కు సంబంధించిన ట్యాక్స్ రూ. 4 లక్షలను కూడా పే చేశాడు.

 

అయినప్పటికీ IT దాడులను నిర్వహించి ఇంటి నుండి రూ. 24 లక్షలను స్వాధీనం చేసుకున్నారట. ఈ విషయంపై తస్లీమా ఆవేదన వ్యక్తం చేశాడు, ట్యాక్స్ కట్టినా కూడా డబ్బు తీసుకెళ్లడం ఏమిటంటూ ఆవేదన చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version