రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మపై పడి ఏడ్చిన కౌశిక్ రెడ్డి

-

ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జూలై 17 నుండి రైతు వేదికలలో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలన్న పిలుపుమేరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం కరీంనగర్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.

వీణవంక మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ దిష్టిబొమ్మ పై పడి కౌశిక్ రెడ్డి.. ” ఓ రేవంతు.. లే రేవంతు.. చెబితే వినకపోతే కదా రేవంతు” అని వెటకారంగా ఏడుస్తూ ఎద్దేవా చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే రైతులకు మూడు గంటల విద్యుత్ మాత్రమే ఉంటుందని.. మళ్లీ పాత రోజులు వస్తాయని అన్నారు కౌశిక్ రెడ్డి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version