వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఓ ఫర్నీచర్ దొంగ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాంటి తప్పుని చేయని మాజీ మంత్రి కొడెల శివప్రసాద్‌పై ప్రభుత్వ ఫర్నీచర్ తీసుకెళ్లారని తప్పుడు కేసులు పెట్టి ఆయనను బలితీసుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ప్రస్తుతం వైఎస్ జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను సరెండర్ చేయకుండా వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
గతంలో కొడెలపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ గురించి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. కొడెలపై తప్పుడు కేసులు పెట్టి బలి తీసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్ దొంగ బుద్ధి చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్న జగన్ చేసిన అరాచకాలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు మంత్రి సత్య ప్రసాద్. జగన్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ను వెంటనే సరెండర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.