ASIA CUP 2022 : నాగిని డ్యాన్స్ తో బంగ్లాదేశ్ పై పగ తీర్చుకున్న శ్రీలంక.. వీడియో వైరల్

-

ఆసియా కప్ లో శ్రీలంక జట్టు మళ్లీ పుంజుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఓడిన శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో శ్రీలంక ఏకంగా రెండు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి రెండు ఓవర్లలో గెలుపు కోసం 25 పరుగులు చేయాల్సి ఉండగా… బంగ్లా విజయం ఖాయం అనిపించింది.

కానీ చివర్లో శ్రీలంకనే గెలిచింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చమిక కరుణరత్నే వెంటనే లంక డ్రెస్సింగ్ రూమ్ లో అతను నాగిని డాన్స్ చేయడం కెమెరాలో రికార్డు అయింది. ఒక రకంగా కరుణరత్నే ఈ డ్యాన్స్ తో బంగ్లాదేశ్ ను ఆటపట్టించాడు.

ఎందుకంటే కొన్నేళ్లుగా బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు నాగిని డాన్స్ తో తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇది వాళ్ళ విజయానందం కంటే అవతలి జట్లను ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. దాంతో, లంక ఆటగాడు కరుణరత్నే బంగ్లాదేశ్ శైలిలోనే ఆ జట్టుపై పగ తీర్చుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version