షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు – జగ్గారెడ్డి

-

వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎవరైనా స్వేచ్ఛగా పోరాటం చేసే హక్కు ఉంటుందని తెలిపారు. షర్మిరపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు జగ్గారెడ్డి. పోలీసులు టిఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి, టిఆర్ఎస్, షర్మిల వ్యవహారమంతా రాజకీయ డ్రామాగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత – షర్మిల ఇద్దరు మంచి యాక్టర్లు అని ఆరోపించారు. తెలంగాణలో యాక్టర్లదే నడుస్తుందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ని రాజకీయంగా అవుట్ చేశారని.. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం లాభం అయిందో తెలియదు కానీ.. రాజకీయంగా కాంగ్రెస్ మాత్రం దెబ్బతిన్నదని అన్నారు. పడుకున్న కేసీఆర్ ని లేపింది మా పార్టీ వాళ్లేనని.. లేపి మరీ తన్నించుకున్నది కూడా మా పార్టీ నాయకులేనని వ్యాఖ్యానించారు. మరో రెండు మూడు రోజులలో ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గే ని మర్యాదపూర్వకంగా కలుస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version