29 గ్రామాల కోసం 26 జిల్లాలలో సమస్యలు సృష్టించడం సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ అభివృద్ధి – పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై లోతైన అధ్యాయనం చేశామన్నారు.
గతంలో చేసుకున్న ఒప్పందాలకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దోపిడీదారులు పాదయాత్రగా వస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స తో పాటు వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు సుభాష్ చంద్రబోస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.