తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ !

-

దేశంలో ఇటీవల ట్విట్టర్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టిడిపికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా ( జై టిడిపి) హ్యాకింగ్ కు గురయింది. టిడిపి ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. టైలర్ హబ్స్ గా అకౌంట్ పేరును మార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులే టిడిపి ట్విట్టర్ అకౌంట్లో కనిపిస్తున్నాయి. బయోలో కూడా తాను ఆర్టిస్టునని మార్చేసుకున్నాడు హ్యాకర్.

ఈ మేరకు టిడిపి డిజిటల్ వింగ్ ( ఐటీడీపీ అఫీషియల్) శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. వైసిపి మద్దతుతో కొందరు వ్యక్తులు తమ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా ఈ కుట్రను ఛేదించి అతి త్వరలోనే టిడిపి ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇక గతంలో కూడా టిడిపి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version