నా భర్తను ఈనెల 11న అదుపులోకి తీసుకున్నారన్నది అవాస్తవం అని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి పేర్కొన్నారు. తాాజాగా ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నవంబర్ 8న కర్నూల్ టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు.. 12న మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు ఆ మూడు రోజుల పాటు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అని తెలిపారు.
తాను కర్నూలు వస్తుండగా.. కర్నూలు నుంచి కడపకు వస్తుండగా.. కర్నూలు జిల్లా కుట్టూరు టోల్ ప్లాజా వద్ద ఏపీ 04బీకే 4055 అనే నెంబర్ గల కారులో వస్తుండగా.. పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోను మీ ముందు ఉంచుతున్నాం. మూడు రోజుల పాటు నా భర్తను చిత్ర హింసలకు గురి చేస్తున్నామని తెలిపారు. తప్పుడు వాంగ్మూలం తీసుకొని చిత్ర హింసలకు గురి చేసారు.