పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చేసరికి విగతజీవిగా తల్లి

-

రాజ‌న్న సిరిసిల్లాలో దారుణం.. అత్త టార్చ‌ర్ త‌ట్టుకోలేక‌ కోడ‌లు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ముగ్గురు పిల్ల‌లు ఆనాథ‌లు అయ్యారు. ‘అమ్మా.. లే అమ్మా’.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారులు రోదిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

It is reported that Ramya committed suicide by hanging herself due to a fight with her aunt at home.
It is reported that Ramya committed suicide by hanging herself due to a fight with her aunt at home.

కుటుంబ కలహాలతో కలత చెంది ఉరి వేసుకుని ఈరవేణి రమ్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అత్తతో గొడవ కారణంగానే రమ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. రమ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుబాయ్‌లో భర్త హరి పని చేస్తున్నాడు. తల్లి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీర‌య్యారు పిల్లలు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపంది.

Read more RELATED
Recommended to you

Latest news