సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణం పట్ల టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నానకరామ్ గూడా లోని కృష్ణ నివాసానికి వెళ్లిన ఆయన కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ ఒక దిగ్గజం లాంటి వ్యక్తి అని చంద్రబాబు ప్రశంసించారు. ఏ నిర్ణయమైనా డేరింగ్ గా తీసుకునే వ్యక్తి అని చెప్పారు.
తాను తిరుపతిలో కృష్ణ మొదటి సినిమాని చూశానని.. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే కృష్ణని కలిసిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. మహేష్ కుటుంబంలో ఒకే ఏడాదిలో ముగ్గురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు చంద్రబాబు. మహేష్ బాబు ధైర్యంగా ఉండాలని చెప్పారు. కృష్ణ భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్, వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు. మహేష్ బాబును హత్తుకుని ధైర్యం చెప్పారు. ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కృష్ణ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.