తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు అలజడి రేపుతున్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 20 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 60 మంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయం, మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్.. ఇన్ఫ్రా, ఐటీ గ్రూప్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నడుపుతోంది. ఈ సంస్థ కార్యాలయంలో.. దీని అనుబంధ సంస్థల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బాచుపల్లి, చందానగర్లోనూ కొనసాగుతున్న ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.