పూజ గది అనేది ఇంటిలో పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఆధ్యాత్మిక శాంతి, దైవసాన్నిథ్యం కోసం పూజలు ధ్యానం ఇతర ఆచారాలు చేస్తుంటాం. పూజగదికి సంబంధించిన కొన్ని నియమాలు హిందూ సాంప్రదాయంలో ఆచరించడం ముఖ్యం. ఈ ప్రదేశం పవిత్రతను కాపాడడానికి కొన్ని వస్తువులను పూజా స్థలంలో లేదా దాని సమీపంలో ఉంచకూడదు. ఈ వస్తువుల పూజా స్థలం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని భగ్నం చేస్తాయి. ప్రతికూల శక్తిని తీసుకువచ్చే అవకాశం ఉంది. మరి పూజ స్థలంలో దూరంగా ఉంచాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం..
పూజా స్థలంలో అపవిత్రమైన వస్తువులు ఉంచకూడదు. ఇవి దైవ శక్తిని బలహీన పరుస్తాయి పూజ యొక్క ఫలితాన్ని తగ్గిస్తాయి. విరిగిన విగ్రహాలు, దెబ్బతిన్న దేవతా చిత్రాలు, పాడైపోయిన పుష్పాలు, పండ్లు ఇతర నైవేద్య సామాగ్రి చెడిపోయిన గడువు ముగిసిన ఆహార పదార్థాలు వంటివి పూజాగదికి దూరంగా ఉంచాలి.
పూజా స్థలంలో చెప్పులు, షూస్ ఇతర ఫుడ్ వేర్ కి సంబంధించిన వస్తువులు ఉంచకూడదు. ఇవి అపవిత్రతను తెస్తాయని హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. పూజ గదిలోనికి ప్రవేశించేముందు కాళ్ళు కడుక్కోవడం మంచిది. చెప్పులను ఇంటి బయట విడిచి లోపలికి రావాలి.

వంట గదిలో ఉపయోగించే సామాగ్రి ముఖ్యంగా మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వస్తువులు పూజా స్థలంలో ఉంచకూడదు. అంతేకాక వండిన మాంసం, చేపలు, గుడ్లు ఇతర మాంసాహార పదార్థాలు. వెల్లుల్లి ఉల్లిపాయతో తయారైన ఆహారం మద్యం, ఇతర మత్తు పదార్థాలు పూజగదికి దూరంగా ఉంచాలి. ఈ వస్తువులు తామసిక గుణాలను కలిగి ఉంటాయని హిందూ శాస్త్రాలు చెబుతాయి. ఇవి ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయి.ఇక పూర్వీకుల చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు. అంతేకాక పెంపుడు జంతువులను పూజా స్థలంలోకి ప్రవేశించకుండా చూడాలి.
పూజ స్థలాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచండి తాజా పుష్పాలు, శుభ్రమైన దీపాలు, పవిత్రమైన నీటిని మాత్రమే ఉపయోగించండి. పూజ స్థలాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం శుభప్రదం. పూజా సమయంలో శబ్దాలు, గందరగోళం లేకుండా చూసుకోండి. ఇది శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతుంది.
(గమనిక:ఈ సమాచారం సాధారణ హిందూ సంప్రదాయాలు, వాస్తు శాస్త్రం ఆధారంగా ఇవ్వబడింది. వ్యక్తిగత నమ్మకాలను బట్టి ఈ నియమాలు మారొచ్చు.)