పుల్వామా దాడికి ప్రతిదాడిగా భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై దాడి దేశ ప్రజలందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కు సరైన బుద్ధి చెప్పామని భారత ప్రజలు వైమానిక దళాలను ప్రశంసిస్తున్నారు. ఫిబ్రవరి 26 తెల్లవారు ఝామున జరిగిన ఈ వైమానిక దాడిలో బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ అతిపెద్ద ట్రైనింగ్ క్యాంప్‌ను టార్గెట్ చేయడంతో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు అంతమొందారని తెలుస్తుంది.
అయితే ఈ దాడికి సంబందించిన వీడియో ఇదే అంటూ సోషల్ మీడియాలో, టివిల్లో కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే అందులో ఒకటి ఇప్పటి వీడియో కాదని తెలుస్తుండగా మరోటి మాత్రం అదొక వీడియో గేమ్ లోనిదని కనిపెట్టారు.
వీడియో 1 :
భారత ఫైటర్ విమానాలు బాంబు దాడులు చేశాయంటూ వచ్చిన ఈ వీడియో 2016 సెప్టెంబర్ 22న తీశారని తెలుస్తుంది. 2016లో యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో తీశారని చెబుతున్నారు.
వీడియో 2 :
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇది వైమానిక దళ ఎటాక్ చేసిన వీడియో కాదని తెలుస్తుంది. ఆర్మా-2 అనే వీడియో గేం లోని వీడియోని షేర్ చేసి నానా హంగామా చేశారు. వీడియోలో పరుగెడుతూ కొంతమంది పాత భవనం లోకి వెళ్లడం.. ఫైటర్ విమానం దాన్ని టార్గెట్ చేసి పేల్చేయడం జరిగింది. ఇది పక్కా వీడియో గేం లోని వీడియో అని తేలింది.