ఇంటివాడు కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఘనంగా నిశ్చితార్థ వేడుక..!!

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ షో దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది బాగా పాపులర్ కూడా అయ్యారు. ఇక అందులో కిరాక్ ఆర్పీ కూడా ఒకరని చెప్పవచ్చు. వారిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వస్తున్నారు కిరాక్ ఆర్పీ. అయితే కొన్నాళ్ళకి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఈయన నాగబాబు రెఫరెన్స్ తో అదిరింది షో లో చేరాడు. కొన్ని రోజుల పాటు కామెడీ స్టార్స్ లో కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు

ఇదిలా ఉండగా డైరెక్టర్ గా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు కిరాక్ ఆర్పీ. ఇక ఇప్పటికే ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్న కిరాక్ ఆర్పి తన పేరుమీద సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేశాడు. అంతే కాదు కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకోవడానికి కాకుండా చాలా సబ్ స్క్రైబర్ లను కూడా పొందారు.

ఇకపోతే ఒకపక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా .. మరో పక్క కామెడీ షో ల ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. ఇక లక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇక మొత్తానికి అయితే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. రెండు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించి మరీ వీరు వివాహం చేసుకుంటున్నారు. ఇటీవల లక్ష్మీప్రసన్న అలియాస్ లక్కీ తో కిరాక్ ఆర్పి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వేడుక జరగడం గమనార్హం. ఇక జబర్దస్త్ స్టార్ కమెడియన్ లైన ధనరాజు, సత్య శ్రీ, చమ్మక్ చంద్ర తో పాటు మరికొంతమంది లేడీ గెటప్ ల వాళ్లు కూడా వీరి ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. అంతేకాదు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే లక్ష్మీప్రసన్న నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version