మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అయితే కనపడుతోంది. ప్రజలకి తాగు నీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకి తాగునీటి ని అందించే వాటర్ ట్యాంకులని నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
సోమవారం నాగార్జున సాగర్ లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ ని ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నోముల భగవత్ తో పాటు పరిశీలించారు. వాటర్ ట్యాంకులో పడి కోతులు చనిపోయినట్లు నీళ్లు తాగి ప్రజల రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వాళ్లకి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు తెలంగాణలో డబ్బులు దోచుకునే ఢిల్లీకి మడుగులు పంపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ బిజీగా ఉందని అన్నారు.