తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ముందస్తూ ఉండదు…వెనకస్తూ రాదని తేల్చి చెప్పారు. మోడీ పాలనలో సంక్షేమం లేదు…అభివృద్ధి జరగదని.. అభివృద్ధి జరిగింది..అంటే అది దళారులకు దోచిపెట్టడమే అంటూ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు బిజెపి 100 మైళ్ళ దూరంలో ఉందని… 25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేదని మండిపడ్డారు.
బిజెపి/కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు ఇస్తున్న ఫించన్ ఎంత అని ప్రశ్నించారు. రైతు బీమా పేరుతో 15 వేల కోట్లు రైతులకు పెట్టుబడిగా అందిస్తున్నది ఒక్క తెలంగాణా లోనే వేల కోట్ల ప్రీమియం తో రైతుకు భీమా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఎప్పుడో పాతర పెట్టారని మంత్రి జగదీశ్ రెడ్డి చురకలు అంటించారు.