తమ ప్రభుత్వం వచ్చే సమయానికి గత ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి 8700 కోట్ల రూపాయల బకాయి పెట్టి పోయిందని అన్నారు ఏపీ సిఎం వైఎస్ జగన్. ఉచిత విద్యుత్ రైతుల హక్కు అని పేర్కొన్న జగన్.. అందుకోసమే మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త విద్యుత్ ప్లాంట్ వల్ల యూనిట్ విద్యుత్ రెండున్నర రూపాయలకే లభిస్తుందన్నారు.
తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకూ నాణ్యమైన ఉచిత్ విద్యుత్ అందించే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. విద్యుత్ మీటర్లపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం.. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. దీనివల్ల యూనిట్ కరెంట్ రెండున్నర రూపాయలకేవస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.