ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కాసేపటి క్రితం కోర్ట్ లో విచారణ జరిగింది. 11 ఛార్జ్ షీట్లలో ఏ1 గా ఉన్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి త్వరితగతిన విచారణ చేయాలంటూ పిటిషనర్ రఘు రామ కృష రాజు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణ రాజు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ సందర్భంగా కోర్ట్ ఈ విచారణను వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు మరోసారి జగన్, సీబీఐ గడువు కోరాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇచ్చింది కోర్ట్. విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది కోర్ట్.