ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవటంలో ఇప్పటికే చాలాసార్లు సంచలనాలు సృష్టించారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రముఖ పార్టీల నేతలే గట్టిగా మెచ్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలకు మాత్రం చెమటలు పట్టే విధంగా వాళ్లు వేసుకున్న ప్లాన్ తల్లకిందులు అయ్యేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన జగన్ తాజాగా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీ అంతా బయట పెట్టడానికి అమరావతి పై జగన్ మరొక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 700 మంది తెల్ల రేషన్ కార్డు దారులు రాజధాని అమరావతి ప్రాంతంలో సిఆర్డిఏ పరిధిలో ఉన్న భూములు కొన్నట్లు సిఐడి గుర్తించింది.
అయితే కొనుగోలు చేసిన వారు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అని ఆ పార్టీకి చెందిన నాయక్ మరియు కార్యకర్తలే కొనుగోలు చేసినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దీంతో ఈ వివరాలన్నింటినీ సిఐడి దర్యాప్తు లో బయటపడిన వివరాలన్నీ ఈడీ కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతి భూ దోపిడీ విషయంలో కేంద్రం సిబిఐ చేత విచారణ చేపించాలి అని జగన్ సర్కార్ ఇటీవల కోరటం జరిగింది.