సహాయం కోరిన కేసీఆర్.. జగన్ కీలక ఆదేశాలు

-

హైదరాబాద్ పరిస్థితి ఏమీ బాలేదు. ఇప్పటికే సగం హైదరాబాద్ మునిగిపోయిన సంగతి తెల్సిందే. అయితే మళ్ళీ హైదరాబార్‌లో ఆర్థరాత్రి నుంచి మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వచ్చే మరో కొద్ది గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు ఈ నేపధ్యంలో ఏపీ సహాయం కోరారు తెలంగాణా సీఎం కేసీఆర్.

ఏపీలో ఉన్న స్పీడ్ బోట్స్ ని తెలంగాణకు పంపమని ఆయన కోరారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సిఎం జగన్ ఆదేశించారు. సియం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు కలిపి మొత్తం 8 స్పీడ్ బోటులను వెంటనే హైదరాబాదు పంపిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. అలానే ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ఈతగాళ్లను (డైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను కూడా పంపుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version