జగన్ ఇప్పుడు అయినా వాళ్ళను కట్టడి చెయ్యాలి…!

-

కొంత మంది మాట్లాడటం జగన్ కు ఎంత కలిసి వస్తుందో తెలియదు గాని ఆయన మాత్రం కొందరి వైఖరి తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఆయనకు పెద్ద సమస్యగా మారింది. చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో కూడా కనపడటం లేదో లేక ఆయన వారికి చెప్పడం లేదో తెలియదు గాని కొందరు మాత్రం చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానీ జగన్ కి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు.

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చిన కొడాలి నానీ ఇప్పుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు వివాదాస్పదంగా మారాయి. కరోనా వైరస్ ని జగన్ భూస్థాపితం చేసారని అనడం ఇప్పుడు అందరికి చికాకు తెప్పించింది. దీన్ని భజన అని కొందరు అంటున్నారు. ఇక ఆయన చంద్రబాబు విషయంలో చేసిన విమర్శలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబు ముసలోడు చస్తాడని భయపడి ఇంట్లో దాక్కున్నాడు అని మాట్లాడారు.

అలాగే మరో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా అనవసరంగా నోరు పారేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడే మాటలు ఇప్పుడు చికాకుగా మారాయి. వైసీపీ కార్యకర్తలు కూడా వీటిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం మానేసి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు భావ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని వలన జగన్ నష్టపోవడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version