ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ముందు ఎన్నికలు నిర్వహించే విషయంలో చాలా వరకు పట్టుదలగా ఉన్న జగన్ ఇప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే 8 నెలల పాటు వాయిదా వెయ్యాలని ఆయన కోరే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. దీనితో తనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని జగన్ ఎక్కువగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశాలు కనపడుతున్నాయని సమాచారం.
వైసీపీలో ఉన్న సీనియర్లు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఇప్పట్లో ఎన్నికలు వద్దు అనే విషయాన్ని జగన్ కి సూచించారు అని తెలుస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడతారని కాబట్టి ఎన్నికలకు దూరంగా లేకపోతే మాత్రం వాళ్ళు ఇప్పుడు అవస్థలు పడితే మాత్రం కేంద్రం సీరియస్ అవుతుందని అప్పుడు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.