వరలక్ష్మి కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించిన జగన్‌

-

విశాఖలో ప్రేమోన్మాది ఉన్మాదానికి బలైన వరలక్ష్మి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ 10 లక్షల సహాయం ప్రకటించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయ చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అలానే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ ను ఆదేశించారు ముఖ్యమంత్రి. ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు ప్రతి మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా వారిని ఎడ్యుకేట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version