జగన్ ఏమి చేసిన ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తారని చెప్పాలి..ఏది చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కతో పక్కాగా ముందుకెళ్తారని చెప్పవచ్చు. ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ..ఆయన వేసే వ్యూహాలు ఎవరి ఊహకు అందవు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఓ వ్యూహం ప్రకారమే నడుస్తోంది. ఉదాహరణకు పథకాలు అమలు చేస్తున్నారు..ఒక్కో పథకం వెనుక ఒక్కో వ్యూహం ఉంటుంది. దాని ద్వారా ఓటర్లని ఆకట్టుకోవడమే టార్గెట్ గా ఉంటుంది.
అదే సమయంలో తాజాగా జగన్..ఎమ్మెల్సీలని ప్రకటించారు. స్థానిక సంస్థలు, గవర్నర్, ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 18 స్థానాలని భర్తీ చేశారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీలకే ఇచ్చారు. అంటే బీసీల ఓట్ల కోసం జగన్ వేసిన ఎత్తు ఏంటో చెప్పాల్సిన పని లేదు. 18 ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది బీసీ, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సంఖ్య 68 శాతానికి పెరుగుతుంది.
అంటే బీసీలకు పెద్ద పీఠ వేశారని చెప్పవచ్చు. ఇలా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఒకటే..బీసీల ఓట్లని ఆకర్షించడమే జగన్ టార్గెట్. గత ఎన్నికల్లోనే బీసీల ఓట్లని జగన్ బాగానే ఆకర్షించారు. మామూలుగా బీసీలు టీడీపీకి అండగా ఉంటారు. మొదట నుంచి ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అని అనడం..కాస్త బీసీల్లో మైనస్ అయింది.
కానీ కాపు రిజర్వేషన్లు జరిగే పని కాదని జగన్ అప్పుడే చేతులెత్తేసి బీసీలని దగ్గర చేసుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో బీసీ ఓటింగ్ వైసీపీకి ఎక్కువ పడింది. 50 శాతం పైనే బీసీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. అంటే బీసీల ఓట్లు ఏ విధంగా రాబట్టారో అర్ధం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చాక కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ ముందుకెళుతున్నారు. బీసీలకు పథకాలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు.
ఒక్కో బీసీ కులానికి ఒక్కో కార్పొరేషన్‌ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఏ పదవి అయినా బీసీలకు ఛాన్స్ ఇస్తూ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద పీఠ వేశారు. దీంతో బీసీల ఓట్లని మరింత ఆకర్షించవచ్చు అనేది జగన్ ప్లాన్. మరి జగన్ బీసీ మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.