ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం నుంచి ఇబ్బంది వస్తుంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగలేదు అని తెలుగుదేశం పార్టీ పదేపదే ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా కొన్ని అంశాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అందించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. విద్యార్థులకు నైపుణ్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు బయటికి వెళ్తున్నారు. వాళ్లందరికీ కూడా ఇప్పుడు తాను అండగా నిలిచే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతుంది. అయితే అప్పులు చేయడంతో రాష్ట్రంలో కాస్త ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యమంత్రి మాత్రం కొన్ని వర్గాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా యువతను ఆకట్టుకునే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకే త్వరలో నిరుద్యోగ భృతి కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ముందు ఇంజనీరింగ్ చదివిన వాళ్లకు జగన్ నిరుద్యోగ భృతి అందించే అవకాశం ఉందని దశలవారీగా అన్ని వర్గాలు దీన్ని అందించే ఆలోచనలో ఆయన ఉన్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి.