విశాఖ మేయర్ ఎన్నిక వైసీపీలో అసంతృప్తికి కారణమయింది. ముందు నుండీ మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ సిటీ పార్టీ అధ్యక్షడు వంశీ కృష్ణ శ్రీనివాస్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వంశీకి న్యాయం చేయాలని జీవీఎంసీ దగ్గర అనుచరుల నినాదాలు చేయడం సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కార్పొరేటర్ గా కొనసాగాలా…!?. వద్దా అనేది నిర్ణయం తీసుకుంటానని, అంతర్గత రాజకీయాలు కారణంగా నాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నానని వంశీ కృష్ణ పెర్కొన్నారు. ఇక ముందు నుండ ఆయన పేరు ప్రచారం జరగగా 11వ డివిజన్ కార్పొరేటర్ హరి వెంకటకుమారికే మేయర్ పదవి వరించింది. అనూహ్యంగా ఆమె పేరు తెర మీదకు వచ్చింది. ఇక లెక్క ప్రకారం వైసీపీకి విశాఖలో 58 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం ఉంది.