తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్‌ది నకిలీ నవరత్నాలు అని చంద్రబాబు సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూటమి నేతల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలకు సంవత్సరానికి రూ. 18 వేలు ఇస్తానని అన్నారు.చదువుకునే విద్యార్థులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ప్రతి ఏటా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి సంవత్సరం దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, తొలి సంతకం ఆ ఫైలుపైనే పెడతామని చంద్రబాబు అన్నారు.ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ప్రజల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబుమండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ వల్ల రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల అప్పు మిగిలిందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు.