రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు అని అన్నారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ముక్కుకు నేలకు రాస్తా అని సవాల్ చేశారు. 65 లక్షల మందికి ఇచ్చింది రైతు భరోసా కాదు రైతు బంధు మాత్రమే అని అన్నారు. కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకాన్నే కొనసాగించారు తప్పా.. రైతు భరోసా అమలు చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారు. రైతు బంధు అనేది తెలంగాణ రైతుల హక్కు అని అన్నారు.డిసెంబర్ 9న ఇవ్వాల్సిన రైతుబంధు కాంట్రాక్టర్లకు పంచిపెట్టారు అని జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకే రైతుబంధు రాలేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పిన తర్వాత బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో చులకన అయ్యామనే భావనతోనే రేవంత్ తాజా హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు.