విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారంగా గత ప్రభుత్వం రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు జగన్ మిగిలిన ఒకటిన్నర కిలోమీటర్ ఉన్న రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. రూ. 125 కోట్లతో ఈ నిర్మాణం జరగనుంది. కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేశారు.
కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు కృష్ణలంక వాసులు పడుతున్న ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు . దీని వలన సుమారు 50 వేల మంది లబ్ది పొందనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు బొత్స, అనిల్ కుమార్, వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, మల్లాది విష్ణు, గుడివాడ అమర్నాధ్, పలువురు ఇతర నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.