కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో జ‌గ‌న్ కీల‌క‌ భేటీ…వీటిపైనే చర్చ

-

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు సమావేశం వీరిద్దరి సమావేశం జరిగింది. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని కేంద్రమంత్రికి వివరించారు సీఎం జగన్‌.

సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్‌ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని తెలిపిన సీఎం… భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని తెలిపారు. విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరిన సీఎం… విజవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరారు.

సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న సీఎం… ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తిచేసిన సీఎం… కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version