ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా మూడో దశలో ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పటి వరకు 439 ఉన్నాయి. ఇవి రాబోయే రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశ౦ ఉందని అంటున్నారు. ఇక ఏడుగురు కరోనా కారనంగాప్రానాలు కోల్పోయారు. ప్రస్తుత౦ ఏపీలో మూడో దశకు వచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
మూడో దశకు గనుక వ్యాధి వెళ్తే మాత్రం దాన్ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు ఒక సవాల్. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో ఉంది కరోనా. రెండు జిల్లాలలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కృష్ణా. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పుడు గనుక ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే,
మరణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని జగన్ కి వివరించారు. ఇప్పటి వరకు ఈ విషయంలో అంత సీరియస్ గా లేని జగన్ ఇప్పటి నుంచి మాత్రం దీన్ని లైట్ తీసుకోవద్దు అని ఆయన కూడా రంగంలోకి దిగారు. వరుసగా కీలక అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే ఆదేశాలు కూడా ఇస్తున్నారు ఆయన.