జగన్ బెయిల్ రద్దు కేసు.. జూన్ 1కి వాయిదా వేసారు. కౌంటర్ దాఖలు కు మరింత గడువు కోరిన సిఎం జగన్, సీబీఐపై రఘురామ తరుపు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ బెయిల్ రద్దు చేయలని రఘు రామ కృష్ణ రాజు పిటిషన్ పై నేడు సిబిఐ కోర్ట్ లో విచారణ జరిగింది. అయితే లాక్ డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదన్న జగన్ న్యాయవాదుల తీరుని రఘురామ లాయర్ తప్పుబట్టారు.
సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. ప్రతివాదులకు జరిమానా విధించాలని రఘురామ న్యాయవాది డిమాండ్ చేసారు. చివరి అవకాశం ఇస్తున్నామన్న కోర్టు.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని స్పష్టం చేసారు. కౌంటర్ ని మెయిల్ ద్వారా కూడా సమర్పించవచ్చు అని రఘురామ లాయర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.