విశాఖలో వరలక్ష్మి హత్యపై స్పందించిన జగన్‌..నిందితులను వదలొద్దంటూ ఆదేశాలు

-

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంలో మృతి చెందిన వరలక్ష్మి హత్యపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు..ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు..వరలక్ష్మి హత్య తనను తీవ్ర కలిచివేసిందని..ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. నేరస్థుడిని వీలైనంత తర్వగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు..వరలక్ష్మి కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్‍కు ఆదేశాలు జారీ చేశారు..మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని..దోషులను చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని డీజీపీ, సీఎస్‍ను ఆదేశించారు..ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు..పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం సీసీ కెమెరాల్లో రికార్డు అయినా దృశ్యాలు ఆధారంగా గాలింపు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version