ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగుకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో సవరణ ప్రతిపాదనలు చేసింది సర్కార్. 70 నుంచి 74 ఏళ్ళ పెన్షనర్లకు 7 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని.. 75 నుంచి 79 ఏళ్ళ పెన్షనర్లకు 12 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.
అటు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలమైనట్లు ఆయన వివరించారు. ఇక ఇవాళ సమ్మె విరమణ ప్రకటన చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ మేరకు లిఖితపూర్వకంగా నోట్ రాసి ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మీడియా సమక్షంలో స్టీరింగ్ కమిటీ సభ్యుల సంతకాలతో ప్రకటన చేయనున్నారు.
సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాల పై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొననున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అలాగే.. సీసీఏను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. మార్చి 2022 నాటికి సీపీఎస్ రద్దు కు రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది.